నందిపేట్, బతుకమ్మ :
భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి అక్రమ సిట్ నోటీసులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అభాసు పాలు చేయాలని ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నందిపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వెల్మల్, ఐలాపూర్ గ్రామంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్దం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పరిపాలన కొనసాగిస్తూ, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ, సంక్షేమ అభివృద్ధిని పక్కనపెట్టి కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని, ఈ వైఖరి వీడనాడి పరిపాలనపై ధ్యాస పెట్టాలని, రైతులకు రైతుబంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్టు, పెన్షన్లు, మహిళలకు 2500 పెన్షన్, వికలాంగులకు 4500 పెన్షన్, ఇలా 420 హామీలను అమలు చేయాలని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నాయకులను తిరగనియ్యమన్నారు. కాంగ్రెస్ నాయకులకు వంత పాడుతున్న అధికారులకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులకు, భవిష్యత్తులో కచ్చితంగా ప్రజా కోర్టులో శిక్ష పడుతుందని నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బాల గంగాధర్, వెల్మల్ రాజన్న, ఆంధ్ర నగర్ మాజీ సర్పంచ్ రామారావు, దారం సురేష్, ఎర్రటి మోహన్, మాజీ ఉప సర్పంచ్ భరత్, తాటికాయల సుభాష్, కేజీ సురేష్, హుస్నాద్దిన్, కొత్తూరు శ్రీనివాస్, గణేష్, వార్డు మెంబర్లు పాష, బుకసాగర్, హద్వాల వినయ్, సాయిలు, రమేష్, రాజేందర్, దుబాయ్ శీను, తాటికాయల సాగర్, అశోక్, నరేష్, విజయ్, భోగన్న, హరీష్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
