29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

వర్ని, బతుకమ్మ : వర్ని మండల కేంద్రంలో  పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. పది సంవత్సరాల దొరల పాలన గడిని కూలగొట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ని సొసైటీ చైర్మన్ నామాల సాయిబాబు, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నేమాని రఘు, బీసీ సెల్ మండల అధ్యక్షులు నరెడ్ల సాయిలు, కలాల్ గిరి, చంద దత్తు, మండల యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు కొత్తోల్ల రాములు,మారుతి సేట్, రమేష్ గౌడ్,సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అవేజ్,యునుస్, మొండి భూమయ్య, కురుమే లక్ష్మణ్,విట్టల్, కాశి, వసంత్, కబీర్, గిరి శంకర్, సవీన్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, హనుమాండ్లు, అప్పారావ్, నారాయణ మహారాజ్  పాల్గొన్నారు.

CM Revanth Reddy's birthday celebrated in grand style

More articles

Latest article