30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీఎం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 

. . . కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపు

 

డిచ్‌పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఈ నెల 6న రానున్నట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులోని కేశపూర్ గ్రామం సమీపంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు రావడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. జిల్లా అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక ప్రకటనలతో సీఎం ఈ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. సుమారు 50 వేల మందితో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం సభను ఘనంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ యూత్ నాయకుడు నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article