రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో సయ్యద్ మహ్మద్ జమాలుద్దీన్ జనేమాన్ జన్నతి ఉర్సు ఉత్సవాల సందర్భంగా మంగళవారం ప్రధాన వీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో గుర్రాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుధవారం దీపారాధన, గురువారం కవ్వాలి, అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆర్గనైజర్లు తెలిపారు. ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు ఊరేగింపులో బందోబస్తు ఏర్పాటు చేశారు.
