29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

24న ఇందూర్ కు సీఎం రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం రాక

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నిజామాబాద్ కు రానున్నరని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుధర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి మాట్లాడుతు… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నరేందర్ రెడ్డిని గెలిపించాలని నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేంధర్ రెడ్డి విద్యారంగం, ఉపాధ్యాయులపై, నిరుద్యోగులపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతు.. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి తనకు టికేట్ కోసం రూ.30 కోట్లు ఇచ్చానని చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నుడా చైర్మెన్ కేశవేణు, మార్కెట్ కమిటీ చైర్మెన్ ముప్పా గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article