29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్సీల అభివృద్దే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పైన సుదీర్ఘంగా ఆలోచించి అసెంబ్లీలో ఎస్సీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపడం పట్ల మాల,మాదిగలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ద్యేయంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుక్షణం వారి పట్ల వారి పక్షాన ఆలోచిస్తూ వారు అభివృద్ధిని చెందేలా ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదానికి సహకరించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు నిజాంబాద్ రూరల్ స్థానిక ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గార్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ బడుగు బలహీన వర్గాల పేద ప్రజలను ఏ రోజు కూడా వారి ఎదుగుదల కొరకు ఆలోచించలేదని అన్నారు. మాల మాదిగల అంటే బీఆర్ఎస్ పార్టీ అంటరాని వాళ్లనుగా చూసి వాళ్ళ ఎదుగుదలను ఓర్వలేక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అడ్డు పడిన ఘనత అప్పటి బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు మానుకొని అభివృద్ధికి సహకరించాలన్నారు. మరోపక్క భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలవగానే తామేదో సాధించినట్లుగా విర్రవీగుతున్నారన్నారు. కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బిజెపి ఎంపీలు నిధులు తేవడానికి ఎందుకు సహకరిస్తాలేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర సహాయ మంత్రులుగా కిషన్ రెడ్డి,బండి సంజయ్లు ఉన్నప్పటికీ ఎందుకు కేంద్రం నుండి నిధులు తీసుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే కొనసాగితే రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి,బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు.ఎస్సీ రిజర్వేషన్లు 32 శాతం ఉన్న రిజర్వేషన్లను బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే 23 శాతానికి కుదించడం ఎంతవరకు సమంజసమన్నారు.రాబోయే రోజులలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను పెంచే ఆలోచనలో ఉన్నారన్నారు.అలాగే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి ఆమోదం తెలపడం పట్ల బీసీలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 నెలల లోపే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అధ్యయనం జరిపి 59 ఉపకులాలను మూడు కులాలుగా కుదించి అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం తెలపడం పట్ల ఈరోజు మాల,మాదిగలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బడుగు బలహీన వర్గాలు,ఎస్సీ సామాజిక వర్గలు ,బీసీ సామాజిక వర్గాలు అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు,ఇందిరమ్మ రాజ్యం అంటేనే కళలు సహకారం చేసే పార్టీ అన్నారు.రాబోయే రోజులలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.రాష్ట్రంలో గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమయోచితంగా డబ్బులను సమకూర్చుతూ ఒక్కొక్కటిగా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్ల సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు ఈర్ల సాహేందర్,ఎల్ఐసి గంగాధర్,మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, డిచ్పల్లి మాజీ ఎంపీపీ ముత్తన్న,చంటి,కెపి గంగారం,వసంతరావు, బాబురావు, గంగారాజ్యం, పూజం రవికుమార్, రాములు,నరేష్,తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article