27.7 C
Hyderabad

అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.5 లక్షల ఎల్.ఓ.సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే 

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలం చింతల్ తండాకు కు చెందిన కే.నికిత్ అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5 లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రన్న ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.

More articles

Latest article