27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సంజీవయ్యకు నివాళులర్పించిన సీఎం, మానాల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article