వెబ్ డెస్క్, బతుకమ్మ:
కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో సిజేపి నిరసన కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే.శనివారం ఉదయం నుంచి యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తున్నారు. శనివారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫ్లైట్‌లోకి వెళ్లి అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిజేపి నిరసనకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోలేదు అనే కారణంతో అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
యుట్యూబర్ ద్రువ్ రాఠీ అరెస్ట్…
గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న యుట్యూబర్ ద్రువ్ రాఠీ ని ఇంటి వద్దకు వెళ్లి అరెస్ట్ చేసిన 50 మంది పోలీసుల బృందం. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో సిజేపి తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన ద్రువ్ రాఠీ. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

