27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కి వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని, వర్క్ కాంట్రాక్ట్ కార్మికులను గ్రూపులు గా చేయాలని టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ఈ విషయమై మంగళవారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య విభాగ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఇప్పటికే సీఐజీ గ్రూపులుగా పని చేస్తున్నారన్నారు. కేవలం వర్క్ కాంట్రాక్ట్ పద్దతిలో ఉన్న 331 మంది కార్మకులు కార్తికేయ ఏజెన్సీ ద్వారా పని చేస్తున్నారని, వీరిని మాత్రమే 35 నుండి 50 మంది కార్మికులను గ్రూపులుగా చేస్తే సరిపోతుందని తెలిపారు. పాత సీఐజీ గ్రూపులను మళ్లీ గ్రూపులుగా 10 నుంచి 15 మంది చొప్పున చేస్తే సమస్య మరింత పెరుగుతుందని, ఇప్పటికే కొనసాగుతున్న సీఐజీ గ్రూపులు ఏ ఇబ్బంది లేకుండా పని చేస్తున్నాయని, వీటిని కదపడం ఏ రకంగాను సరైంది కాదని తెలియజేశారు. కార్తికేయ ఏజెన్సీ, వాటర్ వర్కర్స్, డ్రైవర్స్ ను మాత్రమే గ్రూపులు చేయాలని, పాత సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసి జిల్లా కార్యదర్శి వై.ఓమయ్య, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, టీయుసిఐ జిల్లా నాయకులు డి.కిరణ్, బి.లింగం పాల్గొన్నారు.

More articles

Latest article