కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చింతల కిషన్
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చింతల కిషన్‌ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నూతనంగా నియమితులైన మండల అధ్యక్షుడు చింతల కిషన్‌కు ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చింతల కిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే...