వదల పర్తి లో బాలల హక్కుల పరిరక్షణ ర్యాలీ

0 1,275

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : స్వేచ్ఛగా పెరిగిన బాల్యం ప్రపంచ శాంతికి, సుస్థిరతకు బీజం లాంటిదని వదలపర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వస్త్రాల రాజశేఖర్ అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని వదలపర్తి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామంలోని ప్రజలకు బాలల  విద్యా హక్కు, పోషకాహారం పొందే హక్కు, రక్షణ పొందే హక్కు మొదలైన హక్కుల పట్ల అవగాహన కల్పించారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలల హక్కులను కాపాడు, భవిష్యత్తుకు భరోసా కల్పించు, బంగారు భారతం నిర్మించు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్, అనిత, ప్రమీల, హరీష్, అంగన్ వాడి టీచర్ లలిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి అజీముద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.