వదల పర్తి లో బాలల హక్కుల పరిరక్షణ ర్యాలీ

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : స్వేచ్ఛగా పెరిగిన బాల్యం ప్రపంచ శాంతికి, సుస్థిరతకు బీజం లాంటిదని వదలపర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వస్త్రాల రాజశేఖర్ అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని వదలపర్తి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామంలోని ప్రజలకు బాలల  విద్యా హక్కు, పోషకాహారం పొందే హక్కు, రక్షణ పొందే హక్కు మొదలైన హక్కుల పట్ల అవగాహన కల్పించారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలల హక్కులను కాపాడు, భవిష్యత్తుకు...