29 C
Hyderabad
Monday, August 3, 2026

నందిపేట్ జడ్పీహెచ్ఎస్ లో బాల గ్రామ సభ

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సోమవారం బాల గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పాఠశాలలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం శ్రద్ధగా విని, వాటిని నమోదు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉప సర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు పాషా, పెట్ల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article