నందిపేట్ జడ్పీహెచ్ఎస్ లో బాల గ్రామ సభ

  నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సోమవారం బాల గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను గ్రామ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పాఠశాలలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం శ్రద్ధగా విని, వాటిని నమోదు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన...