24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్ ఆర్, విక్టర్ జూనియర్ కళాశాలల్లో చైల్డ్ సేఫ్టిపై అవగాహన కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అంశంపై ఎస్ఆర్ జూనియర్ కళాశాల, విక్టర్ జూనియర్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాaల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, భరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు తమ హక్కులపై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని, పితృస్వామ్య భావనలు, జెండర్ వివక్షను గుర్తించి ఎదుర్కోవాలని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డబ్ల్యూఎస్ఐ పుష్పావతి, కో-ఆర్డినేటర్ రోజా, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article