- సాధన సంస్థ సీఎస్ ఎం.నిరీక్షణ
బతుకమ్మ, భీమ్ గల్ : సమాజంలో పెరిగే పిల్లలు పనిచేసే బాల కార్మిక వ్యవస్థ వల్ల బాలల పాలిటీ శాపమని, ఈ వ్యవస్థ వల్ల బాల బంగారు భవిషష్యత్తు ప్రశ్నర్తకం అవుతుందని సాధన సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబైలైజర్ నిరీక్షణ అన్నారు. గురువారం అంతర్జాతీయ బాల కార్మికత వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మండలంలోని సికింద్రాపూర్ లో సాధన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాల్యవస్థలో పిల్లలతో పని చేయించడం మూలన వారి పెరుగుదలపై ప్రభావితం చెయ్యడమే కాకుండా మానసిక ఒత్తిడికి గురి అవుతారన్నారు.బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల పైన జరుగుతున్న హింసలు, బాల ఆక్రమ రవాణల గురించి ఆమె వివరించారు. అందరూ భాద్యతగా బాల కార్మిక వ్యవస్థ నిర్ములనలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. బాలలతో పని చేయిస్తున్నట్లు, బాల్య వివాహాలు చేస్తున్నట్లు, బాలలపై హింస చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు కాల్ చెయ్యాలని ఆమె కోరారు. తల్లులు తమ పిల్లల్ని సమాజంలో ఎలా మల్చుకోవాలో తమ భాద్యతగా ఎంచుకొని పెంచాలని ఆమె కోరారు.ఈ సందర్బంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మహిళా సంఘాల సీ. ఏ రత్నాకర్,మహిళాలు తదితరులు పాల్గొన్నారు.
