మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నామన్నారు. ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లడ్డు గంగాధర్, పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్, ఏఏంసీ డైరెక్టర్ నవీద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కం అశోక్, దేవేందర్, శ్రీనివాస్, ఎంసీ గంగాధర్, సుంకేట్ రాజేష్, నాగభూషన్, దొనకల్ రవి, మల్లికార్జున్, ఎర్రం శ్రీనివాస్, పాలెం గ్రామ అధ్యక్షుడు ఏనుగు మోహన్, తిమ్మాపూర్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
