రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి

మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నామన్నారు.  ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నామని...