- డాక్టర్. సంతోష్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ : ప్రస్తుత సీజన్ లో పశువులకు ప్రభలుతున్న గాలికుంటు వ్యాధి నివారణకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గాలికుంటు నివారణ టీకాలను విధిగా యజమానులు తమ తమ పశువులకు ఇప్పించాలని మండల్ వెటర్నరీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్. సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కోమన్ పల్లి లో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంను నిర్వహించి, గ్రామంలోని అన్ని పశువులకు గాలికుంటు టీకాలను ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతు ఈ గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు నోటిలో నుండి చొంగ కారడం, నాలుక పగలడం, కాళ్ళ గిట్టేల మధ్య పుండ్లు కావడం లాంటి లక్షణాలు ఉంటాయాన్నారు. ఈ గాలికుంటు రాకుండానే ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఈ టీకాలను ఇస్తున్నామని సంతోష్ రెడ్డి అన్నారు. రైతులు ముందస్తుగా టీకాలు వేసుకొని మీ యొక్క పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆయన సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పి సురేష్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, గంగాధర్ లైవ్ స్టాక్ అసిస్టెంట్, దయానంద్ గోపాలమిత్ర జావిద్లు పాల్గొన్నారు.