మెండోరా, బతుకమ్మ: గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి, పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని 2025 సెప్టెంబర్ 7న హైదరాబాద్లో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. 31 ఆగస్టు 2025 తేదీన మెండోరా కేంద్రంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. “వేతనము తక్కువ చాకిరి ఎక్కువ”అన్నట్లుగానే పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. 2015 సంవత్సరంలో కార్మికుల పోరాట పలితంగా 9500 లకు వేతనం పెరిగిందని దాసు తెలిపారు. ఒక దిక్కు నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అందుతున్నాయని, పెరిగిన ధరల ప్రకారం పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నరాటి లక్ష్మణ్, నాయకులు పోశెట్టి, కొమిరెసాయన్న, ఎల్లవ్వ, శ్యామల, మరెన్న, లక్ష్మి, చిరంజీవి, సొప్పరి గంగాధర్,విఠల్, రాము, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
