27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ధైర్య సాహసాలకు మారుపేరు చాకలి ఐలమ్మ 

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : అనాటి పరస్థితుల్లో దోరలకు పెత్తందారులకు ఎదురొడ్డి పోరాటం చేసిన తెలంగాణ వీరవనిత  చాకలి ఐలమ్మ పలువురికి ఆదర్శం అని బిఆర్ఎస్ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య , ఏఏంసి చైర్మన్  షేక్ సాబేరా బేగం గౌస్ ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలంగాణ ఉద్యమనాయకులు   అందె సుభాష్ లన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా   రజక సంఘం వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఆమెకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ ఆనాడు భూస్వాములను పెత్తందారులను ఎదిరించి తెలంగాణ వీరవనిత ధీరవనిత చాకలి ఐలమ్మ  తాడిత  పిడిత వర్గాల కోసం పోరాడి తమ భూములు తమకే కావాలని మేం పండించిన పంట మాకే కావాలని పీడిత వర్గాల తరపున పోరాడి అన్యాయాన్ని ఎదిరించిన  తెలంగాణ వీరవనిత ధీరవనిత చాకలి ఐలమ్మ  అని ఆయన కొనియాడారు.ఏఎంసీ చైర్మన్ షెక్  సాబేరా బేగం,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ఆనాడు దొరలను గడగడలాడించిన వీరవనిత   చాకలి ఐలమ్మ అని అన్నారు.ఆమే ఆశయాలను  తెలంగాణ బిడ్డలందరు కొనసాగించాలన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, రజక సంఘం మండల అధ్యక్షులు కంచర్ల నరసింహులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి,పందిర్ల లింగం గౌడ్, బండారి బాల్రెడ్డి , నంది కిషన్,మేగి నర్సయ్య,గంట కార్తీక్ గౌడ్,  పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,గంట బుచ్చ గౌడ్,ఎలగందుల నరసింహులు,చెన్ని బాబు అంతేర్పుల గోపాల్ , మెండే శ్రీనివాస్ యాదవ్ ,రాజేష్ , మాజీ ఏఎంసీ డైరెక్టర్ పెద్దూరి కిష్టయ్య,  రజక సంఘం ప్రతినిధులు గొల్లపల్లి సురేష్ ,తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.

Chakali Ailamma, nicknamed for her bravery

More articles

Latest article