26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం  కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, డీసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి ఆనంద్ లు ప్రారంభించారు. రైతులు నేరుగా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు.ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320, మామూలు వరి ధాన్యానికి 2300 రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని, వరి ధాన్యాన్ని చివరి కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ మారుతి, డిసిసిబి డైరెక్టర్ కోరాట్ పల్లి ఆనంద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్లు కల్వరాల మల్లారెడ్డి,వాయిస్ చైర్మన్ చందర్, వీడీసీ చైర్మన్ జితేందర్,సీఈఓ రతన్, బైరి రవి, కిషన్, మేండే రవి, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article