సిరికొండ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పెద్ద వాల్ గోట్ గిర్నీ చౌరస్తా వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన బుదవారం మధ్యాహ్నం జరిగింది. పెద్ద వాల్గోట్ కు చెందిన పిట్ల నర్సవ్వ అనే వ్రుద్ధురాలు నడుచుకుంటు వెలుతుండగ ఈ ఘటన జరిగింది. సిరికొండ బస్ దిగి గ్రామంలోకి నడుచుకుంటు వెళుతుండగా అన్నపుర్ణమ్మ గుడి సమీపంలో బైక్ పై వచ్చిన అగంతకులు నర్సవ్వ మెడలోని 2 తులాల బంగారు చైన్ ను లాక్కెల్ళారు. బాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు సిరికొండ ఎస్ఐ రామక్రిష్ణ తెలిపారు.
