27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏకల్ గ్రామొత్తన్ ఫౌండేషన్ వారిచే సర్టిఫికెట్స్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ మందిరం లో నిర్వహించిన మండల గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఏకల్ గ్రామోత్తన్ ఫౌండేషన్ తరపున శిక్షణ అందించడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్లను అందజేశారు. ఎటువంటి లాభాపేక్షన లేకుండా ఉచిత సేవ చేయాలనే సంకల్పంతో కార్యక్రమం నిర్వహించామని ఏకల్ గ్రామత్తన్ ఫౌండేషన్ ఇంచార్జ్ ఎక్క రాజేందర్ తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాలుగా అర్థమయ్యే విధంగా కంప్యూటర్ శిక్షణ బోధించిన కోచ్ గణేష్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క సంస్థ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, జోనల్ హెడ్ విజయ్ పాండే, స్టేట్ ఇంచార్జ్ పాండురంగ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నర్సింలు, గ్రామ పెద్దలు మల్లికార్జున అప్ప శెట్కర్, జి. రాజు డాక్టర్, రచ్చ శివకాంత్, భాను దాస్ కులకర్ణి, పతాంజలి సంజు,శెట్టిపల్లి విష్ణు, ఆనంద్ పటేల్, తదితరులు ఉన్నారు.

Certificates were presented by Ekal Gramottan Foundation.

More articles

Latest article