కంచ గచ్చిబౌలి భూముల పరిశీలన
హైదరాబాద్, బతుకమ్మ : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను పరిశీలించేందుకు హెచ్ సీయూకు పర్యావరణ, అటవీశాఖల కేంద్ర సాధికారిక కమిటీ వచ్చింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఈ నెల 16లోగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. సెంట్రల్ ఎంపవర్ కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్,మరో ఇద్దర సభ్యులు బుధవారమే హైదరాబాద్ కు వచ్చారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారుతలో సమావేశం నిర్వహించే అవకాశముంది. కమిటీ రాక నేపథ్యంలో హెచ్ సీయూలో పోలీసులు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు.
