ప్రైవేటు బడిలో సెంటరు.. ఫలితాల కోసం తంటాలు
సిఎస్, ఇన్విజిలేటర్లు పాతవారే నిజామాబాద్, బతుకమ్మ: పదవ తరగతిలో మెరుగైన ఫలితాలను రాబట్టుకునేందుకు మొదటి పరీక్షా నుంచే చూచిరాతలను ప్రోత్సహిస్తున్నారు. దీని కోసం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లను ఇంతకు ముందు పని చేసిన వారినే ఏరికోరి నియమించారు. విద్యార్థులకు విద్యను బోధించడంలో నిర్లక్ష్యం వహించి, ప్రస్తుతం పరీక్షల సమయంలో ఫలితాల కోసం తంటాలు పడుతున్నారు. మాక్లూర్ మండలంలోని మాణిక్ భండర్ గ్రామంలో గల ఉన్నత పాటశాల పదవ తరగతి విద్యార్థులకు దాస్ నగర్ సమీపంలోని ప్రైవేటు బడిలో పరీక్ష రాసేందుకు సెంటర్ వేసారు....