26.2 C
Hyderabad
Monday, August 3, 2026

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

Must read

📰 Generate e-Paper Clip

  • యూరియా విషయమై కేంద్రంపై ఒత్తడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
  • పోడు భూములకు పట్టాలను వెంటనే ఇవ్వాలి
  • ఏఐపీకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.సురేష్

 

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రం లో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్ ఆరోపించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక మండల కమిటీ కార్యవర్గంతో కలిసి ఈ నెల 22న నిర్వహించతలపెట్టిన కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ను విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్, మండల నాయకుల బృందం మండలంలోని రహత్ నగర్, తాళ్లపల్లి, గంగారాయి, ముచ్కూర్, మెండోరా గ్రామాలతో పాటు భీమ్ గల్ లో రైతులను కలిసి యూరియా సరఫరా విషయం అడిగి తెలుసుకొన్నారు. 22న కలెక్టరేట్ వద్ద ధర్నా ను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ యూరియా సరిపడా రాష్ట్రానికి తెప్పించడం పై కేంద్రం పై ఒత్తిడి పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యేండ్లుగా సాగులో, కబ్జాలో ఉన్న గిరిజనులు, గిరిజనేతరులకు పెట్టాలిచ్చి సమస్యను పరిష్కారం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందు గాను 22న నిర్వహించ తలపెట్టిన కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమానికి రైతులు, కర్శకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు జిల్కర నడిపెన్న, కె. రాజేశ్వర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article