- విభాగ్ ప్రచారక్ నర్ర శివకుమార్
బతుకమ్మ, కోటగిరి : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విధంగా కృషి చేయాలనీ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్ర శివ కుమార్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కోటగిరి ప్రఖండ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విధంగా ప్రతి స్వయం సేవకులు కృషిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కార్యచరణలను రూపొందించాలని స్వయంసేవకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ సతీష్, విభాగ్ ప్రముఖ్ వేణు గోపాల్, కోటగిరి ఖండ కార్యవాహ గాండ్ల గోపి, కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాల స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.
