తె.యూలో అంబరాన్ని అంటిన  సంబరాలు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సాంస్కృత, క్రీడా దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వార్షిక దినోత్సవ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారత కబడ్డీ టీం  ప్రధాన కోచ్ డా. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము క్రీడలకు అధిక బడ్జెట్ను కేటాయించడంతోపాటు క్రీడా  విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం స్వాగతించాలని  పేర్కొన్నారు.  విద్యార్థులు క్రీడల్లో రాణించి  మానసిక ఉల్లాసంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ  ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చును అన్నారు.  వైస్- ఛాన్స్లర్  ఆచార్య టి. యాదగిరిరావు  ప్రసంగిస్తూ ...