30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పేకాట స్థావరంపై సీసీఎస్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

. . . ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్టు

. . . 2,56,830 నగదు సీజ్ 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కాదని తొలిసారి సీపీ సాయిచైతన్య సీసీఎస్ కు పేకాట స్థావరాలపై దాడుల బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సిఐ రవికుమార్, సిబ్బందితో కలిసి ఆర్మూర్ శివారులోని బైపాస్ రోడ్డులో గల మల్లారెడ్డి గెస్ట్ హౌజ్ పై ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు స్థానిక చోటామోటా లీడర్లు పట్టుబడ్డారు. గడ్డం మల్లారెడ్డి, ఉట్నూర్ వెంకటేశ్, మజ్జరి రామక్రిష్ణ, ఇట్టెడి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, నూతుల అశోక్ రెడ్డి, లోక సూర్య ప్రకాష్ రెడ్డిలు పట్టుబడ్డారు.వారి వద్ద నుంచి రూ.21830 నగదు, 7 మోబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఆన్ లైన్ చెల్లింపులు రూ.2,35,000 యూపీఏల ద్వారా చెల్లించినట్లు గుర్తించి ఫోన్ల ను సీజ్ చేశారు.

More articles

Latest article