బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన నటులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు చేశారు. నటీమణులు మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, యాంకర్లు రీతూ చౌదరి, శ్యామల, శ్రీముఖిపై కేసు నమోదైంది. యూట్యూబర్ వర్షిణి సహా మొత్తం 25 మందిపై కేసులు నమోదయ్యాయి. కాగా, బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.