28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రమాదవశాత్తు కల్వర్టు ను ఢీ కొట్టిన కారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఒకరు మృతి, మరొకరికి గాయాలు

 

కోటగిరి, బతుకమ్మ :

 

నిజాంసాగర్ కెనాల్ కల్వర్టు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ క్యాంప్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి గ్రామానికి చెందిన మోతిపేట సాత్విక్ (19) అనే వ్యక్తి గురువారం రోజున సాయంత్రం 6:30 గంటలకు కోటగిరి గ్రామానికి చెందిన మాశెట్టి ప్రతాప్ అనే వ్యక్తి తో కలిసి కార్ లో ఎత్తోండ వైపు వెళ్తుండగా ఎత్తోండ క్యాంపు అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానే డ్రైవర్ ప్రతాప్ అట్టి కార్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడిపి రోడ్డుపై గల డివైడర్ ను ఢీ కొట్టగా సాత్విక్ కు తల, పక్కటేముకలకు గాయాలయ్యాయి. అనంతరం చికిత్స నిమిత్తం బోధన్ ఆసుపత్రి కి తరలించగా అప్పటికే సాత్విక్ మృతి చెందాడని ఆయన తెలిపారు. మృతుడి తండ్రి మోతిపేట సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

Car accidentally hits culvert

More articles

Latest article