నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో ” కొవ్వొత్తుల ర్యాలీ ” కార్యక్రమం నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీ కోర్టు చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీసు, ఎన్.టి.ఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎవ్వరు కూడా మరవరు అని, వారి త్యాగాల వలన నేడు ప్రతీ ఒక్కరు శాంతియుతంగా ఉంటున్నారని, అమరవీరుల కుటుంబాలకు యావత్తు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యాక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్ ) జి.బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్ ) రామచందర్ రావు నిజామాబాద్, ట్రాఫిక్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వుఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, శేఖర్ బాబు, సి.ఐలు, ఎస్.ఐలు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

