పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో " కొవ్వొత్తుల ర్యాలీ " కార్యక్రమం నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీ కోర్టు చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీసు, ఎన్.టి.ఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎవ్వరు కూడా మరవరు అని, వారి త్యాగాల వలన...