కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ పట్టణం లోని సివిల్ హాస్పిటల్ సర్కిల్, చొప్పదండి రోడ్, మంచిర్యాల చౌరస్తా వద్ద గల ఆర్. కె హాస్పిటల్ లో ఈ నెల 7 ఆదివారం ఉచిత క్యాన్సర్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు క్యాంప్ నిర్వాహకులు డాక్టర్. బండారి రాజ్ కుమార్ తెలిపారు. ఆర్. కె హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్న ఈ క్యాంప్ లో చూయించుకోవాలని అనుకొనేవారు ముందుగా రీజస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.ఈ క్యాంప్ లో ఉచిత క్యాన్సర్ కన్సుల్టేన్సీ ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో ప్రసిద్ధ సూపర్ స్పెషలిస్టులు డా. హరీష్ దారా (సర్జికల్ ఆంకాలజిస్టు), డా. తేజస్విని (మెడికల్ ఆంకాలజిస్టు) లు పాల్గొని రోగులకు సేవలు అందించనున్నారన్నారు. ముఖ్యంగా మహిళా రోగుల కోసం ప్రత్యేకంగా మహిళా ఆంకాలజిస్టు కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేయబడిందని, క్యాన్సర్‌ను ముందస్తు దశలో గుర్తించడం ద్వారా జీవనావకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతూ, ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని అయన సూచించారు. ఈ శిబిరంలో ఉచిత ఆంకాలజీ కన్సల్టేషన్‌తో పాటు బ్రెస్ట్, మౌత్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లు, రిస్క్ అసెస్‌మెంట్, జీవనశైలి మార్పులు, నిరోధక చిట్కాలు వంటి విలువైన సలహాలు అందించబడతాయని, అదనంగా స్కానింగ్, రక్తపరీక్షలు అవసరమైతే ప్రత్యేక వైద్య పరీక్షలపై ప్రత్యేక రాయితీలు కూడా కల్పించబడతాయన్నారు ఆసక్తిగలవారు తప్పనిసరిగా తమ పాత రిపోర్టులు వెంట తీసుకురావాలని, మరిన్ని వివరాల కోసం 78754 88900, 70936 66900 నంబర్లలో సంప్రదించాలాన్నారు.
