క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం ద్వారకానగర్ లోని ఎస్ఎంఆర్ పితామహ క్యాన్సర్ ఆసుపత్రి లో ప్రపంచ క్యాన్సర్ దినం ను పురస్కరించుకుని క్యాన్సర్ వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.అజ్జ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డా.కే. విక్రం రెడ్డి మాట్లాడుతూ కాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటె ఈ వ్యాధిని నివారించవచ్చునని అన్నారు. పోగాకు, గుట్క, ధూమపానం సేవించడం వల్ల ఊపిరి తిత్తుల వ్యాది వస్తుంది...