24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చు

Must read

📰 Generate e-Paper Clip

. . . మెడికవర్ హస్పీటల్ లో యోగా డేలో ఎసిపి మస్తాన్ అలీ

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చని  నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపి మస్తాన్ అలీ సూచించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మెడికవర్ హాస్పిటల్స్ ఓపి విభాగం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు ధైనందిన జీవితంలో యోగ ప్రాముఖ్యత గురించి తెలియపరిచేందుకు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనిషి ఆరోగ్య పరిరక్షణకు అవగాహన కలిగించే దిశగా కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు.. ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఈ యోగా ఎంతో తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని తెలియపరిచారు.

By practicing yoga regularly, you can overcome physical and mental stress and become calm.

. అనంతరం మెడికల్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వారిస్ అలీ మాట్లాడుతూ యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో  పురాతనమైందని వారు పేర్కొన్నారు.. యోగా చేయడం ద్వారా శరీరము మనసును ఆలోచన విధానాన్ని నియంత్రిస్తుందని తెలిపారు.. నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం శ్రేయస్సు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారు చెప్పారు..కేవలం ఓ వ్యాయామం కాదు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. ఊబకాయాన్ని అరికట్టడంలో యోగా అద్భుతంగా పనికొస్తుందని, గుండె జబ్బులు, కాలేయ సమస్యల నియంత్రణ కూడా యోగాతో సాధ్యమేనని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డయాబెటిస్‌‌తో బాధపడేవారు రోజూ యోగా చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చన్నారు. యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశం. యోగా శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో మానసిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మనస్సులో ఒత్తిడి లేకుండా చేస్తుంది. రోజంతా చురుకుగా ఉంచుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ఇంటర్వెంషనల్ కార్డిలోజిస్ట్  డాక్టర్ సందిప్ రావు, పల్మానాలజీస్ట్ డాక్టర్ ప్రశాంత్ , డాక్టర్ యజ్ఞ, సెంటర్  హెడ్  స్వామి మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ ,వైద్య సిబ్బంది  పాల్గొన్నారు.

By practicing yoga regularly, you can overcome physical and mental stress and become calm.

More articles

Latest article