బతుకమ్మ, ఏర్గట్ల: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వడం కుదరని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దంశ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షులు జైనోద్దీన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం ప్రభాకర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మారు నరేష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రెండ్ల చిన్నయ్య,అట్ల పోచయ్య, చిటుమల పౌలింగ్,మెరుగు రమేష్ యాదవ్,రంజిత్, కూరకుల షాదుల్లా,గన్నారం రాజేశ్వర్ పాల్గొన్నారు.
