బతుకమ్మ నిజామాబాద్ సిటీ : అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిధర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్ట రాజ్యాంగ నడుపుతున్న శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ని శ్రీనగర్ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలకు ఎలాంటి పర్మిషన్ లేనప్పటికీ ఉదయం7:30 నుండి రాత్రి 8:30 వరకు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇస్తారాజ్యాంగ నడిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అలాగే 7వ తరగతి వరకే పర్మిషన్ ఉందని 8, 9, 10 తరగతులకు పర్మిషన్ లేకున్నా ఇష్టరాజ్యంగా నడుపుతున్నారని అన్నారు. వెంటనే శ్రీ చైతన్య స్కూల్ యజమాన్యంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఈ విషయంపై డీఈఓ కి పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శ్రీ చైతన్య పాఠశాలపై విచారణ జరిపి చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో దామ సునీల్, దుర్గా దాస్, రాజకుమార్, అలంకార్, రాజేష్, శశాంక్, శివ, సాయి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
