23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తాళం వేసిన ఇంట్లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆరో టౌన్ పరిధిలోని తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన శుక్రవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని హెచ్బీ సాగర్ హిల్స్ కాలనీ నయా వంతెన వద్ద గల ఆటో నగర్లో గౌస్ నివాసం ఉంటున్నాడు. అస్వస్థతకు గురై ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగుల గొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మూడు తులాల బంగారం, కొంత నగదు అపహరించుకుపోయారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article