26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు బిల్డర్ హతం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భర్త బెట్టింగ్ షోకులకు భార్య ప్రోత్సాహం

 

. . . కానిస్టేబుల్ దంపతుల ఘాతుకం

 

సిద్దిపేట, బతుకమ్మ:

 

ఈ నెల 3న రంగనాయక సాగర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బిల్డర్ కేసును పోలీసులు చేదించారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడి విశ్వనాథం అనే బిల్డర్ వద్ధ రూ.36 లక్షల అప్పులు చేసాడు. అది చాలదన్నట్టు సోదరుడు ప్లాట్ ను తనఖా పెట్టి 12 లక్షలు అప్పులు చేసాడు. వాటిని కూడా బెట్టింగ్ లో తగలేశాడు కానిస్టేబుల్ ప్రవీణ్. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని విశ్వనాథం అడిగడంతో ప్రవీణ్ తన భార్య రజితతో కలిసి విశ్వనాథం మర్డర్ ప్లాన్ చేసారు. ఈ నెల 2 న మాట్లాడుదాం అని పిలిచి.. పెద్దకోడూరు శివారులో నిర్మానుష్య ప్రాంతానికి రప్పించారు. కారులోనే విశ్వనాధంను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని మృతదేహాన్ని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోని మల్లన్నసాగర్ గేటు వద్ద పడేసి హైదరాబాద్ పరార్ అయ్యారు. అక్కడ విశ్వనాథం కు సంబంధించిన బంగారు ఆభరణాలను అమ్మెశారు. ఈ నెల 2న తనభర్త ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని విశ్వనాధం భార్య ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. గత నెలలోను కానిస్టేబుల్ దంపతులు తాము ఉండే చోటనే ఒక ముదుసలి మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారం దొంగలించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నేరస్తులిద్దరిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 

Builder killed for refusing to repay loan

More articles

Latest article