24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యుదాఘాతానికి గేదె మృతి

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ:  విద్యుత్ వైర్లు తెగిపడి షాక్ తగిలి గేదె మృతి చెందినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి సంజీవ్ తెలిపారు. మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన అమృత్వార్ రాములు గేదె శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి గేదె పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచనామ నిర్వహించి మేనూర్ సబ్ స్టేషన్ ఏఈ కి ఇచ్చినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.70 వేల విలువగల గేదె ఉంటుందని ప్రభుత్వ నష్ట పరిహారం అందించాలని గేదె యజమాని ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article