బోధన్ మండలంలో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ

బతుకమ్మ, బోధన్  : బోధన్ మండలంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మండలంలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేకంగా హాజరై నేతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో...