29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బీ ఆర్ ఎస్ దుకాణం క్లోజ్ యింది : పీసీసీ చీఫ్ మహేశ్

Must read

📰 Generate e-Paper Clip

కేటీ ఆర్- కవిత- హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట

కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు..?

గజ్వేల్, బతుకమ్మ :  తెలంగాణలో బీ ఆర్ ఎస్ దుకాణం క్లోజ్ యిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీ ఆర్ ఎస్ లో కేటీ ఆర్- కవిత- హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని వ్యాఖ్యనించారు. సోమవారం మెదక్ జిల్లా  గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించారు.  కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని తేల్చి చెప్పారు. బీసీల గురించి బీ ఆర్ ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శలు చేశారు.

More articles

Latest article