. . . అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు
. . . ఎమ్మెల్యేరెు అరెస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్ట్ లు ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దీంతో ఎమ్మెల్యేలు హరీష్ రావు, అనిల్ జాద్ లు టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ పోలీసులు అరెస్టు చేశారు.
