27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ ధర్నాకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అమలు చేస్తామని చెప్పిన బీ సీ లకు 42 శాతం రిజర్వేషన్ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో కల్పిస్తామని చెప్పి కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ, బీసీలకు స్లాబ్ ప్లాన్ కింద కేటాయిస్తామన్నా రూ. 2వేలకోట్ల నిధులు ఎవని ప్రభుత్వాన్ని నిలదీస్తూ అందుకు నిరసనగా బీసీ ప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న చలో హైదరాబాద్, బీసీ ధర్నాకు వేల్పూర్ మండల బీయర్ యస్ బీ సీ బీయర్ యస్ విభాగం ప్రజా ప్రతినిధుల బృందం బయలుదేరి వెళ్లారు. బీసీ ల్లో మేజర్ కులాలైన గంగపుత్ర, ముదిరాజ్, పద్మశాలి కులాలు ఇచ్చి మార్చిన హామీలను, కులావృత్తుల వారి సంక్షేమ పథకాలు అమలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన వారిలో బీసీ నాయకులు రేగుల్లా రాములు, మాజీ వైస్ ఎంపీపీ సురేష్, మాజీ ఎంపిటిసీ రాజరాపు శోభన్, మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం, మోహన్ యాదవ్, శ్యామ్ రావు, మాజీ సర్పంచ్ మహేష్ యాదవ్, సంపత్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article