ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో బంజారా గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ సురేష్ నాయక్, మెల్లకుంట తాండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, మెల్లకుంట తాండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ చేరికలతో నాగిరెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

