ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ 36వ డివిజన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మందుల స్వప్న పోశెట్టి ప్రచారంలో జోరు పెంచారు. ప్రజలకు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకే వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. ఆడపడుచులతో కలిసి తనను గెలిపించాల్సిందిగా అభ్యర్థనలు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వ హయంలో రైతు బీమా, రైతు బంధు అనేక పథకాలు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఆర్మూర్ పట్టణం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పనిచేసే నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సహకారంతో మీ సేవకురాలిగా పనిచేస్తానని అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని హామి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా కోరారు.
