అర్థంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు

0 8,307

 

. . . కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? . . . పాలకుల నిర్లక్ష్యమా ?

 

. . . స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారు నుండి బోధన్ వైపుకు వెళ్లే బ్రిడ్జి నిర్మాణ పనులను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ. 301.50 లక్షల వ్యయంతో, 2023వ సంవత్సరంలో చేపట్టారు. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే అర్థంతరంగా నిలిపివేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదని, పనులను మధ్యలోనే నిలిపివేశారని రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేయడంలో అంతర్యం ఏమిటని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా?.. పాలకుల నిర్లక్ష్యమా? అనేది అర్థం కాని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. రాయకూర్ గ్రామం నుండి బ్రిడ్జి వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని, ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఈ విషయం పై బోధన్ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా సబ్ కలెక్టర్ స్పందించలేదని గ్రామస్తులు, రైతులు వాపోతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతే పోతంగల్ మండలం, కోటగిరి మండలం, రుద్రూర్ మండలాల్లోని గ్రామస్తులకు, రైతులకు బోధన్ వెళ్లడానికి కేవలం 5 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో సులువుగా వెళ్లొచ్చన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.